హైదరాబాద్: జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష రంగంలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయాల వెనుక శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎన్నో సంవత్సరాలుగా సాగించిన పరిశోధనలు, కృషి, అంకితభావం ఉన్నాయని అన్నారు.భారత అంతరిక్ష విజయాలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తూ తెలంగాణ స్పేస్‌టెక్ హబ్‌గా ఎదుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. యువత కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించి, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.“విజ్ఞానమే మన బలం.. ఆవిష్కరణలే మన భవిష్యత్తు.. అంతరిక్షమే మన తదుపరి గమ్యం కావాలి” అని సీఎం ఆకాంక్షించారు
అంతరిక్ష రంగంలో భారత్ విజయాలకు శాస్త్రవేత్తల కృషే బలం: సీఎం రేవంత్ రెడ్డి















