BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్‌లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, హైడ్రా, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నగరంలో నెలకొన్న పరిస్థితిపై సమీక్షించారు.

వర్షాల కారణంగా నగరంలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Also Read

వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదై జంట జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడితే గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

అటువంటి పరిస్థితి ఏర్పడితే జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, హైడ్రా, పోలీస్, రెవెన్యూ తదితర శాఖలకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తెలిపారు.

గణేష్ మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మ్యాన్‌హోల్స్, నాలాలు తదితర ప్రాంతాల్లో చేపట్టిన డీ-సిల్టింగ్ పనుల్లో వెలువడిన పూడిక, మట్టి, రోడ్లపై ఉన్న డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు.

పూడిక, మట్టిని రోడ్లపై లేదా నాలాల సమీపంలో ఉంచడం వల్ల వర్షపు నీటితో తిరిగి నాలాల్లోకి చేరి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల డీ-సిల్టింగ్ అనంతరం వ్యర్థాలను అక్కడే వదిలేయకుండా తక్షణమే తరలించాలని స్పష్టం చేశారు.

ఎయిర్‌టెక్ యంత్రాలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అవసరమైన సంఖ్యలో ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

అధికారులు కేవలం కార్యాలయాల్లో సమీక్షలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు.

భారీ వర్షాల సమయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సమర్థవంతమైన అలర్ట్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదకర ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం కీలకమని మంత్రి పేర్కొన్నారు.

“అలెర్ట్‌గా ఉందాం.. అలెర్ట్‌గా ఉంచుదాం. ప్రజల భద్రత కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తత

వినాయక చవితి నేపథ్యంలో ప్రత్యేక పర్యవేక్షణ

డీ-సిల్టింగ్ పూడిక, డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలి

ఎమర్జెన్సీ టీమ్స్, ఎయిర్‌టెక్ యంత్రాలు సిద్ధంగా ఉంచాలి

ప్రజలకు నిరంతరం అలర్ట్‌లు ఇవ్వాలి

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News