హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ‘సంధ్యా రావు’ పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ గురించి ప్రస్తావించడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.సంధ్యా రావు పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్‌ను నడిపించేది కాంగ్రెస్ పార్టీయేనని హరీష్ రావు ఆరోపించారు. ఒక ఫేక్ అకౌంట్‌లో చేసిన పోస్టును తీసుకొచ్చి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చదవడం దౌర్భాగ్యకరమైన పరిస్థితి అని విమర్శించారు.ఫేక్ అకౌంట్‌ను ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదని హరీష్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సంధ్యా రావు పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని హరీష్ రావు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని వెల్లడించారు.
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు















