తెలంగాణ రైజింగ్కు ప్రవాసులు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి: సీఎం రేవంత్ రెడ్డిలండన్: తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం లండన్లో తెలుగు ప్రవాసులతో సమావేశమై ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై వారితో విస్తృతంగా చర్చించారు.తెలంగాణ రైజింగ్కు ప్రవాసులు బలమైన మద్దతుదారులుగా, బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం కోరారు.
తెలంగాణ రైజింగ్కు ప్రవాసులు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి: సీఎం రేవంత్ రెడ్డి















