బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశంకాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యాచరణకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన జాప్యాన్ని ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమరభేరి మోగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం















