BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

గచ్చిబౌలి భవనం ఘటనపై సంచలన ఆరోపణలు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలిన ఘటన నేపథ్యంలో బిల్డర్‌ సాజిద్‌ ఖాన్‌ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాజిద్‌ చేపట్టిన పలు నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. చిన్న స్థలాల్లోనే అధిక అంతస్తులు నిర్మించి వాటిని హాస్టళ్లుగా వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.చిన్న మెకానిక్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన సాజిద్‌.. అనంతరం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. సైబరాబాద్‌ పరిధిలో ఆయనకు సంబంధించిన పలు నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు.అంజయ్యనగర్‌ ఘటన తర్వాత సాజిద్‌కు సంబంధించిన ఇతర నిర్మాణాలపైనా అధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అనుమతుల వివరాలు, నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించే పనిలో అధికారులు ఉన్నారు.అక్రమ నిర్మాణాలకు కొందరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సహకరించారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాజిద్‌ నిర్మించిన కట్టడాలపై హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News