తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.ఇక హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో భారీ వర్షాలకు అలర్ట్















