బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగన్ హయాంలో బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. కేబినెట్‌తో పాటు రాజ్యసభలోనూ బీసీలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చామని పేర్కొన్నారు.బీసీ సంక్షేమం విషయంలో వైసీపీ చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని ధర్మాన అభిప్రాయపడ్డారు. వైసీపీలో బీసీ నాయకుల బాధ్యత ప్రస్తుతం మరింత పెరిగిందన్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పార్టీ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.బీసీలను తిరిగి పార్టీకి దగ్గర చేసుకునేలా నాయకులు కృషి చేయాలని ధర్మాన సూచించారు.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యమే సామాజిక న్యాయం: ధర్మాన



















