BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

నాన్‌-జీఎంఓ మొక్కజొన్న వంగడం.. వ్యవసాయ రంగంలో కీలక మైలురాయి

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

మొక్కజొన్న సాగులో రైతులకు అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి అందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్ మొక్కజొన్న వంగడం వ్యవసాయ రంగంలో కీలక ముందడుగుగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.ఏలూరు జిల్లా ముసునూరు కేంద్రంగా పనిచేస్తున్న గోర్మె పాప్‌కార్నికా సంస్థ అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చేయని (Non-GMO) పాప్‌కార్న్ మొక్కజొన్న వంగడాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్రానికి గర్వకారణమని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.ఇలాంటి పరిశోధనలు రైతులకు మెరుగైన దిగుబడులు అందించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. నాన్‌-జీఎంఓ వంగడాల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ వినూత్న వంగడాన్ని అభివృద్ధి చేసిన గోర్మె పాప్‌కార్నికా సంస్థ యాజమాన్యం, శాస్త్రవేత్తలు, పరిశోధక బృందాన్ని పవన్‌ కళ్యాణ్‌ అభినందించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, పరిశోధనలను ప్రోత్సహిస్తూ రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News