హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు.మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.భూసేకరణలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూములకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని చర్యలు చట్టబద్ధంగా చేపట్టాలని అన్నారు.మూసీ రివర్‌ఫ్రంట్‌లో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి రుణ సదుపాయాల కల్పనపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని చెప్పారు. టీడీఆర్‌ల జారీ ప్రక్రియపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ, జేఎండీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతం చేయాలి















