సామాజిక సేవకురాలు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, భారతరత్న మదర్ థెరీసా గారి జయంతి సందర్భంగా ఆమె పవిత్ర స్మృతికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఘనంగా నివాళులర్పించారు.కరుణ, ప్రేమ, సేవాభావాలకు ప్రతిరూపంగా నిలిచిన ఆ మాతృమూర్తి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి, నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల జీవితాల్లో ఆశా కిరణంగా నిలిచారని మదర్ థెరీసా గారి సేవలను స్మరించుకున్నారు.మదర్ థెరీసా జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళిసామాజిక సేవకురాలు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, భారతరత్న మదర్ థెరీసా జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆమె పవిత్ర స్మృతికి ఘనంగా నివాళులర్పించారు.కరుణ, ప్రేమ, సేవాభావాలకు మదర్ థెరీసా ప్రతిరూపంగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి జీవితాంతం నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో ఆశాకిరణంగా మారిన మదర్ థెరీసా సేవా స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె చూపిన మానవతా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.
మదర్ థెరీసా జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి















