బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యమే సామాజిక న్యాయం-ధర్మానజగన్ హయాంలో బీసీలకు ప్రాధాన్యం దక్కిందికేబినెట్లో, రాజ్యసభలో BCలకు ప్రాధాన్యత కల్పించాంబీసీ సంక్షేమంపై వైసీపీ ప్రచారంలో విఫలమైంది-ధర్మానవైసీపీలో బీసీ నాయకుల బాధ్యత మరింత పెరిగిందిఅన్ని సామాజిక వర్గాలను కలుపుకుని YCP ముందుకెళ్లాలిబీసీలను తిరిగి దగ్గర చేసుకోవాలి-ధర్మానబీసీలను తిరిగి దగ్గర చేసుకోవాలి: ధర్మానబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. కేబినెట్‌తో పాటు రాజ్యసభలోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చినట్లు తెలిపారు.బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని ధర్మాన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రస్తుతం వైసీపీలో ఉన్న బీసీ నాయకులపై బాధ్యత మరింత పెరిగిందని ధర్మాన పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పార్టీ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా పార్టీకి దూరమైన బీసీ వర్గాలను తిరిగి దగ్గర చేసుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.బీసీల రాజకీయ, సామాజిక సాధికారతకు వైసీపీ కట్టుబడి ఉందని ధర్మాన స్పష్టం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, అన్ని వర్గాల మద్దతుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బీసీలను తిరిగి దగ్గర చేసుకోవాలి: ధర్మాన



















