BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ప్రచారాలకే పరిమితమైన ‘రాజీవ్ యువ వికాసం?

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

ప్రచారాలకే పరిమితమైన “రాజీవ్ యువ వికాసం”* దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గడుస్తున్నా ముందుకు సాగని అమలు ప్రక్రియ.దరఖాస్తులను మూలకు పడేసిన తెలంగాణ ప్రభుత్వం.యువతను మభ్యపెట్టడానికే దరఖాస్తుల స్వీకరణ పేరిట డ్రామా చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగ్రహం.రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది యువతీ యువకులు.పథకం అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారని యువత ఆగ్రహం.ప్రచారాలకే పరిమితమైన ‘రాజీవ్ యువ వికాసం’?తెలంగాణలో యువతకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలుపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. దరఖాస్తులు స్వీకరించి చాలా కాలం గడుస్తున్నా పథకం అమలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆరోపించింది.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతీ యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వారి దరఖాస్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పథకం పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప, యువతకు ప్రయోజనం చేకూర్చే చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.యువతను మభ్యపెట్టేందుకే దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రభుత్వం డ్రామా చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పథకాన్ని అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు ముందుగానే దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని యువత ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.రుణాలు, స్వయం ఉపాధి అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సహాయం పంపిణీపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రకటించాలని కోరారు

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News