వికారాబాద్: కొత్తగాడిలో దొంగల హల్చల్ స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో రెండు బైకులను దొంగిలించి పారిపోతున్న యువకులను కొత్తగాడికి చెందిన యువకులు సుమారు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.పట్టుబడిన యువకులు హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. దొంగతనాలకు పాల్పడిన ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు వారు చెప్పినట్లు సమాచారం. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తుండగా.. ఇద్దరు పోలీసులకు చిక్కగా, మరో ముగ్గురు తప్పించుకుని పారిపోయినట్లు పట్టుబడిన యువకులు వెల్లడించినట్లు సమాచారం.వికారాబాద్ పట్టణంలో తరచూ బైక్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తులకు వికారాబాద్ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులతో పరిచయాలు ఉన్నట్లు, వారి సహకారంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వారు చెప్పినట్లు తెలుస్తోంది.ఈ ముఠా గతంలో ఎన్ని బైకులు దొంగిలించింది? ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడింది? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.కొత్తగాడిలో తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రివేళల్లో గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొత్తగాడిలో దొంగల హల్చల్.. 20 కిలోమీటర్లు వెంబడించి ఇద్దరిని పట్టుకున్న యువకులు















