BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో చార్జీల బాదుడు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ.. చార్జీల విషయంలో ప్రయాణికులపై అదనపు భారం పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు సాధారణ చార్జీ సుమారు రూ.290 ఉండగా.. పండుగ సందర్భంగా 1:50 రూల్ పేరుతో అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. మెట్రో డీలక్స్ స్పెషల్ బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు రూ.400 వరకు చార్జీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అదనపు చార్జీల బాదుడు తప్పడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.మరోవైపు, కొన్ని స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కిన తర్వాత మార్గమధ్యంలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జర్నలిస్టులకు వర్తించే 1/3 రూల్‌ విషయంలోనూ స్పెషల్ బస్సుల్లో స్పష్టత లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆప్షన్ చూపించకుండా చార్జీలు వసూలు చేస్తున్నారని కొందరు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చార్జీల పెంపుపై ప్రయాణికులు ప్రశ్నిస్తే ఆర్టీసీ సిబ్బంది నుంచి పొంతన లేని సమాధానాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పండుగ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన చార్జీల వివరాలను ముందుగానే ప్రకటించాలని, అదనపు వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News