రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడపనున్నారు. గత ఏడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా, ఈసారి మరో 240 బస్సులను పెంచారు.రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆగస్టు 30, 31 తేదీల్లో తిరుగు ప్రయాణాల రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. బస్స్టేషన్లలో మంచినీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రాఖీకి టీజీఎస్ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులు















