*కొండా సురేఖకు పెరుగుతున్న మద్దతు*కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రవర్ణ నేతలు కుట్ర పన్నుతున్నారని బీసీ సమాజం ఆగ్రహంమంత్రివర్గం నుంచి సురేఖను తొలగించరాదని బీసీ నేతలు హెచ్చరికరవీంద్రభారతిలో జరిగిన పద్మశాలి సర్పంచుల అభినందన సభలో కొండా సురేఖకు మద్దతు తెలుపుతూ తెలంగాణలోని 5035 మంది సర్పంచులు తరపున తీర్మానం ప్రవేశ పెట్టిన బీసీ నాయకులుకొండా సురేఖకు పెరుగుతున్న మద్దతుకొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీసీ సమాజానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లోని కొందరు అగ్రవర్ణ నేతలు సురేఖపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తే బీసీ సమాజం తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు.హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల అభినందన సభలో కొండా సురేఖకు మద్దతుగా బీసీ నాయకులు తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలోని 5,035 మంది సర్పంచుల తరఫున ఈ తీర్మానాన్ని ప్రకటించినట్లు తెలిపారు.బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడంలో కొండా సురేఖ కీలకంగా వ్యవహరిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు చేయడం సరికాదని అన్నారు. సురేఖకు బీసీ సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేశారు..
కొండా సురేఖకు పెరుగుతున్న మద్దతు.















