ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పీఎం-అభిమ్ (PM-ABHIM) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మౌలిక వసతులకు మరింత బలం చేకూరుతోంది. రాష్ట్రంలో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేయడంతో అత్యాధునిక వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.ఈ మౌలిక వసతుల అభివృద్ధితో అత్యవసర వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ, ప్రజారోగ్య సేవల్లో సామర్థ్యం పెరగనుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.
బలంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.



















