నేడు అరకులోయలో సీఎం చంద్రబాబు పర్యటనసంజీవని పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎంరచ్చబండలో పాల్గొననున్న సీఎం చంద్రబాబుగన్నెలలో ప్రజావేదిక బహిరంగ సభకు హాజరుకానున్న సీఎంటీడీపీ నేతలతో సమావేశంకానున్న చంద్రబాబుఅరకులోయలో సీఎం చంద్రబాబు పర్యటనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సంజీవని డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ప్రొఫైల్/హెల్త్ కార్డు అందించి, వారి వైద్య సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అనంతరం సీఎం చంద్రబాబు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. గన్నెలలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభకు కూడా ఆయన హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.పర్యటనలో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశమై పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
అరకులోయలో సీఎం చంద్రబాబు పర్యటన.



















