విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విజయసాయి తన సొంత కారణాలతోనే పార్టీ నుంచి బయటకు వెళ్లారని అన్నారు. పార్టీని వీడిన నేతలపై వైఎస్ జగన్ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదని తెలిపారు.ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ వైసీపీ మళ్లీ పుంజుకుంటోందని సజ్జల పేర్కొన్నారు. జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని విజయసాయి ఆరోపించడం దారుణమన్నారు. నిజంగా జగన్ మతమార్పిడులను ప్రోత్సహించి ఉంటే.. విజయసాయినే పార్టీ నుంచి మార్చేవాళ్లని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం విజయసాయి చేస్తున్న ఆరోపణలు కేవలం అటెన్షన్ కోసమేనని సజ్జల విమర్శించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్.



















