విజయసాయినే జగన్ ఎక్కువగా అభిమానించారు-సజ్జలసొంత పార్టీ పెట్టుకోవడం కోసం విమర్శించడం ఎందుకువిజయసాయి సొంతంగా రాజకీయాలు చేసుకోవచ్చుమమ్మల్ని టార్గెట్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుందినాపై కేసులు పెట్టడానికి అప్పట్లో రాజకీయాల్లో లేను2024 తర్వాత తప్పుడు కేసుల్లో అంతా అరెస్ట్ అయ్యారుకానీ విజయసాయి అరెస్ట్ కాకుండా ఎలాతప్పించుకోగలిగారువిజయసాయి ఆరోపణలను ఇకపై పట్టించుకోను-సజ్జలపార్టీ నేతలు కూడా విజయసాయి ఆరోపణలు పట్టించుకోవద్దువిజయసాయి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారు-వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డివిజయసాయిపై సజ్జల ఘాటు వ్యాఖ్యలువైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జగన్ ఎక్కువగా అభిమానించిన నేత విజయసాయిరెడ్డేనని సజ్జల పేర్కొన్నారు. సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంటే రాజకీయంగా ముందుకు వెళ్లవచ్చని, అందుకోసం తమపై విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమను టార్గెట్ చేస్తే స్పందన కూడా గట్టిగానే ఉంటుందని సజ్జల హెచ్చరించారు. తనపై కేసులు పెట్టే సమయంలో తాను రాజకీయాల్లో లేనని, 2024 తర్వాత తప్పుడు కేసుల్లో పలువురు అరెస్టయ్యారని అన్నారు. అయితే విజయసాయి మాత్రం అరెస్టు కాకుండా ఎలా తప్పించుకోగలిగారని ప్రశ్నించారు.విజయసాయి చేస్తున్న ఆరోపణలను ఇకపై తాను పట్టించుకోబోనని సజ్జల స్పష్టం చేశారు. పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలకు స్పందించవద్దని సూచించారు. విజయసాయి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
విజయసాయిపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు.



















