2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన, విజయం సాధించిన 1000 మందికి పైగా అభ్యర్థులను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఘనంగా సత్కరించారు.సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అభ్యర్థిని నాదెండ్ల మనోహర్ స్వయంగా కలిసి అభినందించారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ప్రజల్లో జనసేన భావజాలాన్ని తీసుకెళ్లిన అభ్యర్థుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. విజయం సాధించిన వారితో పాటు పోటీ చేసి పార్టీ కోసం పనిచేసిన అభ్యర్థులకు కూడా సముచిత గౌరవం కల్పించారు.ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల కృషి పార్టీ బలోపేతానికి కీలకమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో స్థానిక స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తమను స్వయంగా కలిసి సత్కరించినందుకు అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.



















