BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్: హకీంపేట్ దాటిన అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు సమాచారం.పోలీసుల తీరును నిరసిస్తూ కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు.అదుపులోకి తీసుకున్న కేటీఆర్‌, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పోలీసులు వాహనాల్లో తరలిస్తున్నప్పటికీ.. వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.కేటీఆర్ తీవ్ర ఆరోపణలుఈ సందర్భంగా కేటీఆర్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు దగ్గరుండి కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు.“నేను మా ఇంటికి వెళ్తుంటే నాతో పాటు మా పార్టీ సభ్యులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రం కేసీఆర్ గారి ఇంటి వరకు పంపిస్తున్నారు” అని కేటీఆర్ ఆరోపించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.కేసీఆర్ ఇంటిపై దాడికి పోలీసులు మార్గం సుగమం చేస్తున్నారని, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ కాంగ్రెస్ కార్యకర్తలను ముందుకు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.పక్క జిల్లాల నుంచి వచ్చిన భారీ సంఖ్యలో ప్రజలను కూడా కేసీఆర్ ఇంటివరకు పంపిస్తూ.. బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకోవడం ఏ విధమైన న్యాయమని ఆయన ప్రశ్నించారు.

“కేసీఆర్‌కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత”కేసీఆర్ ఇంటిపై ముట్టడి జరిగితే తెలంగాణ అగ్నిగుండంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని కేటీఆర్ హెచ్చరించినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.కేసీఆర్‌కు ఏదైనా జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతల సమస్యగా మారకముందే పోలీసులు ప్రభుత్వానికి వంతపాడటం ఆపాలని కేటీఆర్ సూచించినట్లు తెలిపారు.పోలీస్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలకు దారి చూపించి తప్పుకుంటే, భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News