ప్రతి పల్లెకు ఆధునిక వైద్య సదుపాయాలుఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.గ్రామీణ ప్రాంతాల్లోనే నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా మౌలిక వసతులను బలోపేతం చేస్తోంది. ప్రతి పల్లెలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఆధునిక సదుపాయాలతో పీహెచ్సీలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
ప్రతి పల్లెకు ఆధునిక వైద్య సదుపాయాలు
















