నేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తంనేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులపై ఆరాఢిల్లీ ఏపీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకంట్రోల్ రూమ్ నెంబర్ 011-23384016, 23387089వాట్సాప్ నెంబర్ 9059824101వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి..సురక్షిత ప్రాంతాలకు తరలించాలి-సీఎం చంద్రబాబునేపాల్ వరదలపై కేంద్రంతో సమన్వయం చేయాలి-సీఎంనేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తంనేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసుల వివరాలను సేకరించి, వారి భద్రతపై ఆరా తీస్తోంది. రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే వారిని గుర్తించి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు, పర్యాటకులకు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:📞 011-23384016📞 011-23387089📱 వాట్సాప్: 9059824101నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆచూకీ తెలియకపోతే ఈ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
నేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం



















