ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. స్టైపెండ్ పెంపు సహా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సమ్మె 14వ రోజుకు చేరడంతో వైద్య సేవలపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.
ఏపీలో జూడాల సమ్మె 14వ రోజుకు.

















