సికింద్రాబాద్: స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ వైద్యులు సికింద్రాబాద్‌లోని ఆయుష్ కమిషనర్ కార్యాలయం ఎదుట మరోసారి ధర్నాకు దిగారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదంటూ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 20 రోజులకు పైగా స్టైఫండ్ పెంపు కోసం నిరసన కొనసాగిస్తున్నామని ఆయుష్ వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఆయుష్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. దీంతో కొద్ది రోజులుగా కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలన్న అంశంపై గతంలోనూ న్యాయపరమైన చర్యలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నట్లు హైకోర్టు రికార్డుల్లో ప్రస్తావన ఉంది.ప్రభుత్వం తమ సమస్యను వెంటనే పరిష్కరించి స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయుష్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.కీలక డిమాండ్: ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్‌ను పెంచి, ఇతర వైద్య విద్యార్థులతో సమానంగా చెల్లించాలని వైద్యులు కోరుతున్నారు.
స్టైఫండ్ పెంపు కోసం ఆయుష్ డాక్టర్ల ఆందోళన.















