కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నూకరాజు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు కోరారు.ఈ కేసులో మోసం, బ్లాక్మెయిల్, ఆర్థిక దోపిడీ, బెదిరింపులు, ఆస్తులపై ఒత్తిడి, బలవంతపు మతమార్పిడికి ప్రయత్నం వంటి ఆరోపణలు ఉన్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఆరోపణలన్నింటినీ లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను కోరారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బీజేపీ నాయకులు కోరారు. కేసులో ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి.. పోలీసులకు బీజేపీ నేతల వినతి



















