మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి గారి మాతృమూర్తి శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో శేషమ్మ గారి చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగరాజు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శేషమ్మ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి















