తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తన కలంతో ఆవిష్కరించిన సాహితీయోధుడు, తెలుగు సాహిత్యానికి అపూర్వ సేవలందించిన దాశరథి రంగాచార్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ అక్షర తపస్వికి నివాళులర్పించారు. ✴️ “తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను, సామాజిక వాస్తవాలను తన రచనల్లో సజీవంగా ప్రతిబింబిస్తూ ప్రజల పక్షాన నిలిచిన మహోన్నత సాహితీవేత్త. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని, నాటి సామాజిక పరిస్థితులను అక్షరబద్ధం చేసి, ఆ పోరాట స్ఫూర్తిని తరతరాలకు అందించిన ఘనత దాశరథి రంగాచార్య గారిది.✴️ వేదాలు, ఉపనిషత్తులు వంటి అపారమైన భారతీయ జ్ఞాన సంపదను తెలుగులోకి అనువదించి సామాన్య పాఠకులకు చేరువ చేసిన ఆయన కృషి తెలుగు భాషా, సాహిత్య చరిత్రలో చిరస్మరణీయం. సాహిత్యాన్ని ప్రజా చైతన్యానికి సాధనంగా మలచిన ఆయన జీవితం, రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.
దాశరథి రంగాచార్య జయంతి.. అక్షర తపస్వికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి















