హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్రమ నిర్మాణానికి యజమానిగా ఉన్న సాజిద్ ఖాన్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఇతర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.మరోవైపు సాజిద్ ఖాన్ నిర్మించినట్లు చెబుతున్న ఇతర అక్రమ కట్టడాలపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ నిర్మాణాలపై HYDRAA అధికారులు పరిశీలన చేపట్టే అవకాశం ఉంది.అక్రమ నిర్మాణాలకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారంపైనా మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టారు. నిర్మాణాలకు అనుమతులు ఎలా లభించాయి? నిబంధనల ఉల్లంఘనలను అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు? అనే అంశాలపై కూడా విచారణ సాగుతోంది.దర్యాప్తు పూర్తయిన తర్వాత అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, అధికారుల పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గచ్చిబౌలి ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. సాజిద్ ఖాన్ అరెస్ట్















