మొక్కజొన్న సాగులో రైతులకు అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి అందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మొక్కజొన్న వంగడం వ్యవసాయ రంగంలో కీలక ముందడుగుగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఏలూరు జిల్లా ముసునూరు కేంద్రంగా పనిచేస్తున్న గోర్మె పాప్‌కార్నికా సంస్థ అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చేయని (Non-GMO) పాప్‌కార్న్ మొక్కజొన్న వంగడాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్రానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు.ఇలాంటి పరిశోధనలు రైతులకు మెరుగైన దిగుబడులు అందించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. నాన్-జీఎంఓ వంగడాల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ వినూత్న వంగడాన్ని అభివృద్ధి చేసిన గోర్మె పాప్‌కార్నికా సంస్థ యాజమాన్యం, శాస్త్రవేత్తలు, పరిశోధక బృందాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, పరిశోధనలను ప్రోత్సహిస్తూ రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
నాన్-జీఎంఓ మొక్కజొన్న వంగడం.. వ్యవసాయ రంగంలో కీలక మైలురాయి



















