BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

నకిలీ వైద్యుల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

సరైన వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రజలకు చికిత్స అందిస్తున్న ఆరుగురు నకిలీ వైద్యులను హైదరాబాద్ కమీషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఎలాంటి అనుమతులు, వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిర్వహిస్తూ రోగులకు ఇంజెక్షన్లు, ఐవీ సెలైన్లు ఇవ్వడంతో పాటు కొన్ని సందర్భాల్లో సర్జికల్ కుట్లు కూడా వేస్తున్నట్లు గుర్తించారు.మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ప్రాంతంలో మాజీ నర్సుగా పనిచేసిన మహిళ అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతంలో డిగ్రీ చదివిన వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తూ రోజుకు పలువురు రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తేలింది. ఫిల్మ్‌నగర్‌లో ఫార్మసీ నిర్వహిస్తున్న మరో వ్యక్తి తన కుమార్తె వైద్య విద్యకు సంబంధించిన వివరాలను ఉపయోగించుకుని తానే డాక్టర్‌గా చెలామణి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.బోరబండలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవంతో ఓ వ్యక్తి అనధికారికంగా క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు.దాడుల్లో వివిధ రకాల ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్, గడువు ముగిసిన మందులు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, బీపీ మెషిన్లు, స్టెతస్కోప్‌లు, సర్జికల్ పరికరాలు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సామగ్రి విలువ వేల రూపాయల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News