గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు గోదాములు దగ్ధం**హైదరాబాద్:** గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొగల్ఖానా సమీపంలోని ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో వరుసగా నాలుగు గోదాములు మంటల్లో చిక్కుకున్నాయి.ప్రమాదంలో గోదాముల్లోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు.ఇప్పటికే రెండు గోదాముల్లో మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది.. మిగిలిన ప్రాంతాల్లోనూ మంటలు వ్యాపించకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఇదికి తగ్గ
గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు గోదాములు దగ్ధం















