శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారి సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించడం జరుగుతుంది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని పారదర్శకంగా సమీక్షించిన మీదట జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులకు సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు.జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే, పోటీ చేసే అభ్యర్థులు వీరే అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల పేరుతో తీర్మానాలు చేస్తున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి చేరింది. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణను అందరూ పాటించాలి. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని, వారి ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా జనసేన పోటీ ఉంటుందని ఇటీవలి పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో వెల్లడించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలి.-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంహెడ్‌లైన్స్థానిక ఎన్నికలపై కూటమి చర్చలు.. పవన్‌దే తుది నిర్ణయంస్లగ్స క్షిప్త వార్తస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నట్లు వెల్లడించింది.క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని పారదర్శకంగా సమీక్షించిన అనంతరం జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని స్థానాలు, అభ్యర్థుల పేర్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది.కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల పేర్లతో తీర్మానాలు చేస్తున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి వచ్చిందని తెలిపింది. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన కోరింది. జన సైనికులు, వీర మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ పోటీ ఉంటుందని స్పష్టం చేసింది.
స్థానిక ఎన్నికలపై కూటమి చర్చలు.. పవన్‌దే తుది నిర్ణయం



















