BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ఖమ్మంలో జనసేన కీలక సమావేశం.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

ఖమ్మంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పాత్రను విస్తరించడం వంటి అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు.ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జనసేన ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఖమ్మం మేయర్ ఎన్నికలో జనసేన మద్దతు కీలకంగా మారిందని పేర్కొన్నారు.అలాగే రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా బరిలోకి దింపే అంశాన్ని వెల్లడించారు.గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ప్రజలకు నిరాశే మిగిలిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని తెలిపారు.తెలంగాణలో పార్టీకి బలమైన క్యాడర్‌ను నిర్మించి, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించే దిశగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News