హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో పోలీసుల చర్యలపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.FIR నమోదు చేయడంలో అలసత్వం వహించడంతో పాటు, కేసుకు సంబంధించిన వ్యక్తిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో ముత్తు యాదవ్పై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా, ముత్తు యాదవ్ కేవలం మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు..!















