హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న పవర్ ఎక్స్పో-2026ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను పరిశీలించిన ఆమె విద్యుత్ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికత, పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. విద్యుత్ రంగంలో సాంకేతికతను ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు
పవర్ ఎక్స్పో-2026ను సందర్శించిన కవిత















