BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

కొత్తగాడిలో దొంగల హల్‌చల్.. 20 కిలోమీటర్లు వెంబడించి ఇద్దరిని పట్టుకున్న యువకులు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

వికారాబాద్: కొత్తగాడిలో దొంగల హల్‌చల్‌ స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో రెండు బైకులను దొంగిలించి పారిపోతున్న యువకులను కొత్తగాడికి చెందిన యువకులు సుమారు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.పట్టుబడిన యువకులు హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. దొంగతనాలకు పాల్పడిన ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు వారు చెప్పినట్లు సమాచారం. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తుండగా.. ఇద్దరు పోలీసులకు చిక్కగా, మరో ముగ్గురు తప్పించుకుని పారిపోయినట్లు పట్టుబడిన యువకులు వెల్లడించినట్లు సమాచారం.వికారాబాద్ పట్టణంలో తరచూ బైక్‌ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తులకు వికారాబాద్ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులతో పరిచయాలు ఉన్నట్లు, వారి సహకారంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వారు చెప్పినట్లు తెలుస్తోంది.ఈ ముఠా గతంలో ఎన్ని బైకులు దొంగిలించింది? ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడింది? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.కొత్తగాడిలో తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రివేళల్లో గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News