అభివృద్ధిపై రాజీలేదు.. హద్దులు దాటితే చర్యలు తప్పవు: మహేష్‌కుమార్ గౌడ్హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీపడకుండా ముందుకు సాగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అయితే ఆ స్వేచ్ఛ హద్దులు దాటితే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.పార్టీ నేతలకు ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఉంటే బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా ముందుగా అధిష్ఠానానికి తెలియజేయాలని సూచించారు. నేతల వ్యవహారశైలిపై క్రమశిక్షణ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.అన్ని అంశాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటామని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
అభివృద్ధిపై రాజీలేదు.. హద్దులు దాటితే చర్యలు తప్పవు: మహేష్‌కుమార్ గౌడ్















