BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

అంతరిక్ష రంగంలో భారత్‌ విజయాలకు శాస్త్రవేత్తల కృషే బలం: సీఎం రేవంత్ రెడ్డి

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్‌: జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష రంగంలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా తన శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయాల వెనుక శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎన్నో సంవత్సరాలుగా సాగించిన పరిశోధనలు, కృషి, అంకితభావం ఉన్నాయని అన్నారు.భారత అంతరిక్ష విజయాలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తూ తెలంగాణ స్పేస్‌టెక్ హబ్‌గా ఎదుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. యువత కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించి, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.“విజ్ఞానమే మన బలం.. ఆవిష్కరణలే మన భవిష్యత్తు.. అంతరిక్షమే మన తదుపరి గమ్యం కావాలి” అని సీఎం ఆకాంక్షించారు

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News