కోదాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు, ఘటనలో మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోదాడ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం



















