అమరావతి: ఐక్యత, సామరస్యం, సిరిసంపద, కుటుంబ బంధాలకు ప్రతీకగా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మలయాళీ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.ఓనం పండుగ ప్రతి ఇంటా ఆనందం, ప్రశాంతత, సౌభాగ్యాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తిరువోణం పర్వదినం ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓనం పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా, ఐక్యత, సామరస్యం, కలిసి జీవించే స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.దేశవ్యాప్తంగా ఉన్న మలయాళీ ప్రజలందరికీ హృదయపూర్వక ఓనం శుభాకాంక్షలు తెలిపారు.
ఐక్యత, సామరస్యం, సంతోషానికి ప్రతీక ఓనం: పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు



















