BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం.. తుది దశకు పనులు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

పులివెందుల: ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ఊరట కలిగించేలా మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి అధికారులు వేగవంతం చేశారు.జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.280 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 96 శాతం పూర్తికాగా, పైప్‌లైన్ నిర్మాణం 99 శాతం పూర్తయినట్లు తెలిపింది.ప్రాజెక్టులో భాగంగా 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి గాను 1,106 కిలోమీటర్లు పూర్తయ్యాయి. కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు కూడా పూర్తయ్యాయి. రోజుకు 65 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.పులివెందుల పట్టణం, గ్రామీణ ప్రాంతాలతో పాటు సింహాద్రిపురం మండలంలో పథకానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. లింగాల మండలంలోని 27 ఆవాసాల్లో 24 ప్రాంతాలకు తాగునీటి సరఫరా అందించే ఏర్పాట్లు పూర్తయ్యాయి.గతంలో నిధులు, పరిపాలనా సమస్యల కారణంగా పనులు నెమ్మదించినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. పులివెందులతో పాటు పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News