హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం విదేశీ పర్యటన, మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ















