తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రాఖీ శుభాకాంక్షలుమహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో..పథకాలు అమలు చేస్తున్నాం-సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రాఖీ శుభాకాంక్షలుమహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వెల్లడించారు. మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో ఎదిగేలా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు.మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారికి ఆర్థిక అవకాశాలు కల్పిస్తూ కుటుంబ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరింత పెరగాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతో, ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రాఖీ శుభాకాంక్షలు















