రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం మల్లారెడ్డి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని సీఎం గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు తదితర అంశాలపై నిరంతరం కృషి చేస్తూ తన జీవితాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేసిన నాయకుడు మల్లారెడ్డి అని కొనియాడారు.మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం















