హైదరాబాద్: తెలంగాణలోని జిల్లా న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. ఈ నెల 27వ తేదీ గురువారం రాష్ట్రంలోని జిల్లా న్యాయవ్యవస్థకు ప్రత్యేక సెలవు ఇస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు.హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ప్రత్యేక సెలవు తెలంగాణలోని అన్ని జిల్లా కోర్టులతో పాటు అన్ని ట్రైబ్యునల్స్, లేబర్ కోర్టులకు వర్తించనుంది. గతంలో జారీ చేసిన సెలవుల నోటిఫికేషన్లలో పాక్షిక మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు పేర్కొంది.ఆగస్టు 27న జిల్లా న్యాయస్థానాలు, ట్రైబ్యునల్స్, లేబర్ కోర్టుల్లో సాధారణ న్యాయ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంబంధిత న్యాయ విభాగాలకు, అధికారులకు హైకోర్టు నోటిఫికేషన్ ద్వారా సమాచారం అందించింది.
తెలంగాణలో కోర్టులకు ప్రత్యేక సెలవు.. ఆగస్టు 27న న్యాయస్థానాలు బంద్















