BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

కాకినాడలో సంచలనం.. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ అరెస్ట్

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

కాకినాడలో సంచలనం.. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ అరెస్ట్కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న సాధిక్‌ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కాకినాడలో తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా సాధిక్‌ఖాన్‌ పేరు తెరపైకి రావడంతో అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.సాధిక్‌పై ఇప్పటికే సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై ఉన్నట్లు సమాచారం. అలాగే రాజమండ్రి టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ అతడిపై మరో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా జగదీష్‌రెడ్డి హత్య కేసులోనూ సాధిక్‌ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.యూపీలో పట్టుబడిన సాధిక్‌ను కాకినాడకు తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. అతడి విచారణ అనంతరం ఏఈ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News