BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

బోడుప్పల్‌లో మైనింగ్ ఏడీ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో కొనసాగుతున్నట్లు సమాచారం.హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు పుస్తకాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే జనగామ జిల్లాలోని 5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.అయితే సోదాలు ఇంకా పూర్తికాలేదు. దీంతో జయరాజుకు సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ ఎంత? మరిన్ని నగదు, బంగారం లేదా కీలక పత్రాలు లభించాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. తనిఖీలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News